Thread Reader
The Catwoman

The Catwoman
@dr_genmed

Mar 1, 2023
13 tweets
Twitter

చాలా కారణాలు ఉన్నాయి అండి. 1. ఆహారపు అలవాట్లు‌: ఇదివరకు ఎప్పుడైనా బయట ఆహారం తీసుకునే వారు. ఇప్పుడు రకరకాల ఆహారం ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకోవటంతో సులభం గా ఇంటికే వచ్చేస్తుంది. దీంతో చాలా వరకు ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. చూడటానికి సన్నగా ఉన్నా, రక్తంలో కొవ్వు శాతం ఎక్కువగా ఉండవచ్చు.

దేవయ్య

దేవయ్య
@DeviprasadSD

ఈ హఠాత్ గుండె పోటులకి.. ఈమధ్యనే విపరీత పోకడలు పోతున్న మన ఆహార అలవాట్లకి ఏదో అక్రమ సంబంధం ఉందేమోననిపిస్తుంది. ఏమంటారు వైద్య శిఖామణులారా. @hemanth @బటన్ నొక్కుడు బాదుడే బాదుడు @🕴🏻 @Dr.మహిష్మ kodidela @The Catwoman @Dr.A.V.S Reddy
వాడిన నూనె మళ్లీ మళ్లీ వాడటం, తక్కువ ఫైబర్, ఎక్కువ కొవ్వు, తీపి పదార్థాలు తినటం ఎక్కువైంది. దీని వల్ల కచ్చితంగా డయాబెటిస్, బిపి, ఊబకాయం పెరుగుతుంది. దీంతో గుండె జబ్బులు వచ్చే ఆస్కారం పెరుగుతుంది.
2. జన్యుపరమైన కారణాలు: కొందరికి తల్లిదండ్రుల నుంచి గుండెజబ్బులు రావచ్చు. అవి స్ట్రెస్ కు గురి కానంత వరకు బయటపడవు. ఎప్పుడైనా పరుగు, ఆట మొదలగు పనులు చేసినప్పుడు గుండె స్ట్రెస్కి గురై సడన్ కార్డియాక్ అరెస్ట్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఉద్యోగాలకు వెళ్లే ముందు మెడికల్ చెకప్ అడుగుతారు
3. పొగతాగటం: ఈ మధ్య చిన్న స్కూల్ పిల్లల తో సహా పొగ, మద్యం తాగటం ఫ్యాషన్ గా మారింది. ఎంత చిన్న వయసు నుండి మొదలు పెడతారు, ఏం తాగుతారు, రోజుకి ఎన్ని తాగుతారు అనే దాన్ని బట్టి వాళ్ల వంటిపై ప్రభావం ఎంత మేరకు ఉంటుంది అనేది తెలుస్తుంది. గుండె జబ్బులకు అత్యంత ప్రధాన మైన కారణం ఇదే.
4. డ్రగ్స్: ఈ మధ్య టీనేజ్ పిల్లలు కూడా హర్ట్ ఎటాక్ కి గురి కావటం జరుగుతుంది. కొన్ని హానికారక నిషేధిత మత్తు పదార్థాల వల్ల గుండె పై హఠాత్తుగా వత్తిడి పెరిగి అది ఆగిపోయే ప్రమాదం ఉంది. చాలా వరకు ఇలాంటి రహస్యాలు తేలిగ్గా బయట పడవు.
5. వ్యాయామం : విపరీతమైన మితిమీరిన వ్యాయామం కూడా గుండె పై తీవ్రమైన వత్తిడి కలిగిస్తుంది. తాము ఎంత చేయగలము అనేది తెలుసుకోవాలి. ఇక చేయలేము అనిపిస్తే ఆగి విశ్రాంతి తీసుకోవాలి. అవసరమైతే ఆపేసి డాక్టర్ ను సంప్రదించాలి.
6. కరోనా: కరోనా వచ్చాక హఠాన్మరణాలు పెరిగాయి. దానికి కారణం.. కరోనా జబ్బు వల్ల రక్తం చిక్కబడే అవకాశాలు, రక్త నాళాలలో ఇన్ఫ్లమేశన్ పెరుగుతాయి. దాని వల్ల మునుపు వారికి ఎలాంటి గుండె జబ్బులూ, రక్త నాళాలు లో ఎటువంటి సమస్య లేకపోయినా హఠాత్తుగా రక్తం క్లాట్ అయ్యి హర్ట్ ఎటాక్ రావచ్చు.
7. వాక్సిన్: ఏ జబ్బు కైనా వాక్సిన్ తయారు చేసేటప్పుడు దానికి సంబంధించిన అంశ తోనే తయారు చేస్తారు. అందుకే ఆ జబ్బు తాలూకు లక్షణాలు తక్కువ తీవ్రత తో వాక్సిన్ తీసుకున్న కొంత మందిలో రావచ్చు. అంటే మన శరీరం ఆ ఇన్ఫెక్షన్ తాలూకు లక్షణాలతో పోరాడుతుంది.
ఆ క్రమంలో అతి తక్కువ మందికి కాస్త తీవ్రంగా రావచ్చు. కానీ రిస్క్ బెనిఫిట్ అనాలసిస్ చేస్తే వాక్సిన్ తీసుకోకపోతే వచ్చే నష్టం తో పోలిస్తే తీసుకుంటే వచ్చే లాభం ఎక్కువ. ఈ రకమైన అనాలసిస్ ఆపరేషన్ దగ్గర్నుండి ప్రతి వైద్య విధానం లోనూ ఉంటుంది.
అందుకే వైద్యం ఎప్పుడైనా రోగి (కన్సెంట్) అనుమతి తోనే చేస్తారు. అది వాక్సిన్ విషయం లోనూ జరుగు తుంది. కరోనా వాక్సిన్ విషయం లో ప్రతి పనికి వాక్సిన్ సర్టిఫికేట్ తప్పని సరి అని గవర్నమెంటు వారి ఆర్డర్ మానవ హక్కులను ఉల్లంఘించినట్టే.
కాకపోతే కరోనా లాంటి ఒక భయంకరమయిన పరిస్థితి మునుపు ఎన్నడూ రాలేదు. ఒక యుద్ధం కంటే తక్కువేం కాదిది. ఇలాంటి సందర్భాల్లో ప్రజల ప్రాణాలు దృష్టిలో ఉంచుకుని కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. అవి ఒక్కోసారి మానవ హక్కులు, ప్రాథమిక హక్కులను వ్యతిరేకం కావచ్చు.
జరిగే పరిణామాలను బట్టి ఏది సరైనది అనేది కాలమే నిర్ణయించాలి.
8. స్ట్రెస్: పెరుగుతున్న పని వత్తిడి, మారుతున్న ఆలోచనా విధానం, పోటీ తత్వం, మెటీరియలిస్టిక్ ప్రపంచం కూడా మనుషుల్లో ఒత్తిడి పెంచుతుంది. దాని వల్ల శరీరంలో కొన్ని రకాల హార్మోన్లు ఉత్పన్నం అవుతాయి. ఎప్పుడో ఒకసారి జరగాల్సింది ప్రతి రోజూ ప్రతి క్షణం జరగడం వల్ల గుండెపై దుష్ప్రభావాలుంటాయి
The Catwoman

The Catwoman

@dr_genmed
😊😂🤗 Happy Doctor Happy whatever! #Music #Dance #Astronomy #తెలుగు #Movies #amethodinmymadness #medtwitter
Follow on Twitter
Missing some tweets in this thread? Or failed to load images or videos? You can try to .