Thread Reader
Saradhi

Saradhi
@SaradhiTweets

Mar 7, 2023
8 tweets
Twitter

**సైలెంటు హార్ట్ అటాక్ రాకూడదంటే ఏం చేయాల?** ఓ వారం క్రితం నా ఆప్తమిత్రుడు మెసేజ్ చేసాడు.. ప్రభాకర నీ గుండెజబ్బులపై అవగాహన బాగుంది... నాకు 58 సంవత్సరాలు. డయాబెటిస్ లేదు,బిపి లేదు..రోజు వాకింగ్ చేస్తాను, ధ్యానం చేస్తాను..ధూమపానం. మద్యపానం అలవాటు లేదు

నేను ECG,ఎకో పరీక్షలు చేయించుకున్నాను.నార్మల్ గా ఉన్నాయి.రక్తపరీక్షలు అపుడపుడు చేపించుకుంటాను.అవి నార్మలే.మా వంశంలో గుండెజబ్బుమరణాలున్నాయి.అంతా బాగుంది కాని,హోమోసిస్టిన్ విలువలు రక్తపరీక్షలు లో ఎక్కువగా ఉన్నాయి,నేనేమైనా చేయాలా అన్నాడు.అన్నాను.
నార్మల్ 80% మందికి ఉండచ్చు.చూద్దాం,అన్నాను, నేను నీకు వంశపారంపర్యంగా ఉంది మరలా హోమోసిస్టిన్ విలువలు ఎక్కువగా ఉన్నాయి కావున ఈ ECG, ఎకోలు పక్కన పెట్టి వెంటనే CTSCAN లో కొరోనరీ ఆంజియోగ్రామ్ చేపించాలి అన్నాను.. అది 10000 వరకు అవతాది అని చెప్పాను.. ఎందుకు అన్నాడు...
ఎందుకంటే చాలా దేశాలలో దానిని స్క్రీనింగు టెస్ట్ గా వాడతారు... 50 ఏళ్ళు దాటిన వారు చేసుకోవడం మంచిది.. నీకురిస్కు ఫాక్టర్ ఉంది కావున చేయించు ఒక వేళ మెడికల్ మాఫియా అనుకుంటాడేమో అని కాస్త జంకి నిదానంగా అయినా చేపించు అన్నాను...
అంతే..మాటే మంత్రములా పనిచేసిందో,వేళావిశేషమో, మన వాక్సుద్దో, మైత్రీబందం పైం గౌరవమేమో వెంటనే మరుసటి రోజే చేయించుకున్నాడు.. ఆశ్చర్యం అంతా నార్మల్ లేదు.. మెయిన్ LAD నాళంలో 80-90% బ్లాక్ ఉంది.. మిగతా రెండింటిలో 40-50% బ్లాక్ లు ఉన్నాయి,.
వెంటనే కన్ఫర్ము ఆంజియోగ్రాము చేయించి ఒక స్టెంటు వేసుకోమన్నాను.. ఇలాంటివే సడన్ హార్ట్ అటాక్ లకు కారణం.. కోవిడో లేదా కోవిడ్ వ్యాక్సిన్ కాదు.. స్క్రీనింగు చాలాముఖ్యం..సైలెంట్ కిల్లర్ అంటే ఇదే... మనమెంతో ఖర్చులు పెడతాము,, కొన్ని పరీక్షలు అనవసరం అనిపించినా జాగ్రత్తగా ఉండేకి చేసుకోవాల.
... ECG మామూలుగా నార్మల్ గా అందరికీ ఉంటాది,.హార్ట్ అటాక్ వచ్చినపుడే కనుక్కో కలదు....ఎకో,ట్రెడ్మిల్ అనేవి కొంత పసిగట్టచ్చు,,, ఫుల్ ప్రూఫ్ గా తెలుసుకోవాలంటే CT ఆంజియో ఉత్తమమైనది.. మరలా మెడికల్ మాఫియా అని అపార్ధం చేసుకోకండి.. నాకు CT SCAN ల యాపారమసలే లేదు...కార్పొరేట్ ఆసుపత్రి లేదు
సైన్సు పరిజ్ఞానం, అనుభవంతో చెప్పాను... అంతే... మీరు జాగ్రత్తగా ఉంటేనే సైలెంటు హార్ట్ అటాక్ నుండి కాపాడబడతారు... జాగ్రత్తగా ఉంటారు కదూ? Dr.C. ప్రభాకర రెడ్డి MS MCh (CTVS) గుండె మరియు ఊపిరితిత్తుల శస్త్ర చికిత్స నిపుణులు కర్నూలు. ఆంధ్రప్రదేశ్
Saradhi

Saradhi

@SaradhiTweets
a technocrat, politics, sports is a hobby. RTs, Mentions are never an endorsement :)
Follow on Twitter
Missing some tweets in this thread? Or failed to load images or videos? You can try to .